
-
శివాజీ నగర్ ఫేస్ -2 సర్వే నేఁ . 240,241,242 లో
-
ప్లాట్ల భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
-
పరస్పరం రాళ్ల దాడులు, పలువురికి గాయాలు
-
300మంది కుటుంబాల అర్థనాదాలు
-
కన్నీటి పర్యంతం.. వందల మంది కుటుంబాలు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివాజీ నగర్ ఫేస్ -2 భూ వివాదంలో చెలరేగిన ఘర్షణ పరస్పర రాళ్లదాడులకు ఇద్దరి మధ్య దాడిలో రెండు ద్విచక్ర వాహనాలు తగలబెట్టడం జరిగింది. కొంత మంది కి గాయాలు కావటం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… కమ్మగూడలోని సర్వే నెంబర్ 240, 241, 242లో 10.09 ఎకరాల భూమి విషయంలో ఓ మహిళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో ఆ భూమి తమదేనంటూ కొన్నాళ్లుగా అక్కడ కబ్జా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఆ ప్రాంతంలో వెంచర్లు వెలిసి, కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. దీంతో ప్లాట్లు, ఇళ్ల యజమానులకు, ఆ మహిళ వర్గానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. 10రోజుల క్రితం ప్లాట్లలో వేసిన కడీలను, ఇతరత్రా నిర్మాణాలను కూల్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మరోసారి తమకు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయంటూ పలువురు ప్లాట్ల కడీలు, ఫ్రీ కాస్ట్ గోడలను కూల్చివేసేందుకు యత్నించారు.
దీంతో స్థానిక ప్రజలు, ప్లాట్ల యజమానులు కబ్జాకు యత్నిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఘర్షణలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడటంతో కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు భారీగా మోహరించి, పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్