ఆమనగల్లు శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం 12 గంటలపాటు దేవాలయం మూసివేత..!
మళ్లీ తిరిగి రాత్రి 10 గంటలకు దర్శనం
దేవాలయం మేనేగింగ్ డైరెక్టర్ కొంకపాక మృతుంజయ్ శాస్త్రి వెల్లడి
క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: చంద్రగ్రహణం సందర్భంగా రేపు అనగా తేదీ: 03-03-2026, మంగళవారం నల్గొండ జిల్లా, వేములపల్లి మండలము ఆమనగల్లు శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు దేవాలయమును మూసివేసి, మళ్లీ తిరిగి రాత్రి 8 గంటలకు తెరచి సంప్రోక్షణ చేసిన అనంతరం రాత్రి10 గంటల నుండి దర్శనములు జరుగును కావున భక్తులు గమనించి దేవస్థానం వారికి సహకరించగలరని దేవాలయ మేనేగింగ్ డైరెక్టర్ కొంకపాక మృతుంజయ్ శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు.
