తెలంగాణ

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా తీగల కృష్ణారెడ్డి!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు.పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్న చంద్రబాబు.. ముందుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనుంది. ఈనెల 26 శనివారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలంగాణ టిడిపి`సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కానుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి టీటీడీడీ నేతలు సన్నాహాక సమావేశం నిర్వహించుకున్నారు. సీనియర్ నాయకుల నుంచి సూచనలను, సలహాలను కూడా తీసుకున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అన్ని కమిటీల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. తెలుగుదేశం పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడానికి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావడానికి ఈ కార్యక్రమాన్ని మంచి అవకాశంగా తీసుకోవాలని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ నిర్ణయించింది.తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రారంభించనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చింది.

మరోవైపు తెలంగాణ టీడీపీ చీఫ్ రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. ఇప్పటివరకు అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపించినా.. ఇప్పుడు హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి టీటీడీపీ పగ్గాలు ఇస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తీగల.. ఇటీవలే షాకింగ్ ప్రకటన చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత తాను తెలుగుదేశం పార్టీలో చేరుతానని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. దీంతో తీగల కృష్ణారెడ్డి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబు దాదాపుగా డిసైడ్ అయ్యారంటున్నారు. తీగల సారథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు స్కెచ్ వేశారంటున్నారు.

Read More News’s

  1. దీపావళి కానుక.. ఒక్కో కార్మికునికి 3 లక్షల రూపాయలు
  2. కేసీ వేణుగోపాల్‌తో భట్టి మీటింగ్.. రేవంత్ శిబిరంలో టెన్షన్!
  3. డబ్బుల్లేవ్.. డీఏలు ఇవ్వలేం.. ఉద్యోగుల ముందు చేతులెత్తేసిన సీఎం!
  4. కారు టైర్ బ్లాస్ట్.. అఘోరీకి తృటిలో తప్పిన ప్రమాదం..!
Back to top button