తెలంగాణ
Trending

హైడ్రా కు హెచ్చరికలు!.. మరోసారి అలా జరిగితే హైడ్రా ను రద్దు చేస్తాం: హై కోర్ట్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైడ్రాకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా వాటిని ఉల్లంఘిస్తున్నారని హైదరాబాద్ హైకోర్టు సీరియస్ అవుతూ హెచ్చరికలు జారీ చేసింది. మేము ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 99 కు విరుద్ధంగా వెళితే దానిని రద్దు చేసి హైడ్రాను పూర్తిగా మూసివేస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అయితే తాజాగా సంగారెడ్డి పటాన్ చెరు లో అక్రమంగా షెడ్ కూల్చివేశారని దాటులైన పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోవద్దని హైడ్రాకు హెచ్చరించింది. ఇక ఈ విషయంపై త్వరలోనే తదుపరి విచారణ మార్చి 5 తేదీకి వాయిదా వేసింది.

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు..వినూత్న కార్యక్రమానికి శ్రీకారం నల్గొండ ఎస్పీ!..

కాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట రాష్ట్రంలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. ఆ తరువాత ఎన్నో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇందులో భాగంగానే చాలామంది కొన్ని కోట్లు విలువ చేసే భవనాలను కూడా అక్రమ నిర్మాణాల కింద ఉంటే కూలగొట్టేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక హైలెట్ టాపిక్ గా మారిపోయింది. చాలామంది ప్రజలు ఈ హైడ్రాను వ్యతిరేకిస్తుంటే మరి కొంతమంది మాత్రం అక్రమ నిర్మాణాలను తప్పకుండా కూల్చివేయాలని.. కాబట్టి హైడ్రా అనేది చాలా మంచి విషయమని అంటున్నారు.

జిహెచ్ఎంసి అధికారులు అలర్ట్ గా ఉండాలి …సీఎం రేవంత్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button