-
గంటకు పైగా అన్నం తింటున్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్.
-
మర్రిగూడలో బ్యాంక్ ముందు ప్రజలు పడిగాపులు.
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- ఎక్కడా లేని నిబంధనలు, ఎక్కడా లేని సమయపాలనలు, కేవలం మర్రిగూడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మాత్రమే ఉన్నాయనిపిస్తుంది. ఖాతాదారులే దేవుళ్లుగా భావించే బ్యాంక్ వ్యవస్థ, కొన్ని చోట్ల మాత్రం తమ ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారు..
లంచ్ బ్రేక్ అంటూ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో, బ్యాంక్ తలుపులకు తాళాలు వేస్తున్న, బ్యాంక్ సిబ్బంది 3గంటలు అవుతున్నా, తలుపులు తెరవని పరిస్థితి నెలకొంది. ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా, సేవలు నిలిపివెయ్యకుండా ఒకరి తరువాత ఒకరు భోజనం చెయ్యాల్సిన సిబ్బంది, కట్టకట్టుకొని భోజనాలు చెయ్యడం, బ్యాంక్ లోపల ఉన్న ఖాతాదారులను, బలవంతంగా బయటికి నెట్టడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
ఖాతాదారుల వల్లే తమకు జీతాలు వస్తున్నాయి అని మరిచిన సిబ్బంది, అవగాహన లేని ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి..!? సేవల కోసం బ్యాంకుకు వచ్చిన ప్రజలపై, కోపం చెయ్యడం, సరైన సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెట్టడంపై, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు. గోల్డ్ లోన్ పెట్టిన ఒక మహిళా మరణించడంతో, బ్యాంక్ అధికారులు చెప్పిన విధంగా డాకుమెంట్స్ ఇచ్చి, పూర్తి లోన్ కట్టినప్పటికి, సదరు నామినికి గోల్డ్ ఇవ్వకుండా, కనీసం కట్టిన రశీదులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుంది.
అవగాహన లేని ప్రజలకు శాంతంగా, సమాధానం చెప్పకుండా మొఖంపైనే తిట్టడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. త్వరిగతన సేవలు అందించకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందనే చెప్పుకోవాలి. ఏదేమైనా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో, ఖాతాదారుల ఇబ్బందులపై పై స్థాయి అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు..





