క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని అంబర్ పేట నగరంలో ఉన్నటువంటి శంకర మఠం కూరగాయల మార్కెట్ ను ఇవాళ ఉదయం అధికారులు జెసిబి లతో పడగొట్టారు. శంకర మఠం కూరగాయల మార్కెట్ రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారంటూ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూరగాయల దుకాణాల్ని జెసిబి లతో తొలగించారు. కాగా ఈ శంకర మఠం కూరగాయల మార్కెట్ కు దాదాపుగా 80 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా బ్రతుకులను రోడ్డుపాలు చేసిందని తాజాగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రంజీల్లో కోహ్లీ ఒక్కరోజు జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!..
కాగా మరోవైపు నానక్ రాంగూడ ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపుతో మా బతుకులు రోడ్డున పడ్డాయి అంటూ సుమారుగా ఒక వంద మంది వీరి వ్యాపారాలు స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో డీసీ ముకుంద రెడ్డిని కలిశారు. తక్షణమే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఓ గదిలో తల్లి మృతదేహం, మరో గదిలో ఇద్దరు కూతుళ్లు.. 9 రోజులు శవంతోనే..!