
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య భారీ వర్షాలు కురిసాయి. ఈ భారీ వర్షాలు కురిసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి మునిగిపోయిందని కొంతమంది వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వ నిర్వాకం ఇది అని మండిపడ్డారు. ఒకే ఒక్క వర్షానికి అమరావతి జలమయం అయిందని చాలానే న్యూస్ స్ప్రెడ్ చేశారు. అయితే వీటిపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కొంతమంది వైసీపీ నేతలు కావాలనే రాజధాని అమరావతిపై సాక్షి టీవీతో అలాగే సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. అసలు మునిగిపోయింది అమరావతి కాదు.. మీ వైసీపీ పార్టీ అని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదన్న కోపంతో బయట ఎలా పడితే అలా విషం చిందుతున్నారు అని ఫైర్ అయ్యారు.
Read also : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఈ దేశాలకు భారీగా తగ్గిన పర్యాటకుల సంఖ్య!
వైసీపీ పార్టీ.. అరుంధతి సినిమాలో భూతం మాదిరి కన్నా ఎక్కువగా తయారయిందని.. ఎద్దేవా చేశారు. ఈ భూతాన్ని భూస్థాపితం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ పార్టీ లోని కొంతమంది నాయకులు కావాలనే అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై కమిటీ వేసి ఖచ్చితంగా ఫేక్ న్యూస్ రాసే వారిని అలాగే ఫేక్ న్యూస్ సృష్టించే వారిని వదిలిపెట్టబోమని అన్నారు. మరోవైపు మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ విషయంపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి పునర్నిర్మాణాల కోసం.. పునాదులు తవ్యాం. దాదాపు పది నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తున్నప్పుడు.. అమరావతి పునాదులే కాదు… ఎక్కడ ఏ పునాది అయినా కూడా మునుగుతుంది కదా , ఆ మాత్రం సెన్స్ లేకుండానే మాట్లాడుతున్నారా?.. అని ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు.
Read also : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఈ దేశాలకు భారీగా తగ్గిన పర్యాటకుల సంఖ్య!