
- ఒక్కసారి కేసు నమోదు అయితే జీవితాంతం ఇబ్బంది తప్పదు…
- చండూరులో నెలకు 180 కేసుల వరకు నమోదు
చండూరు క్రైమ్ మిర్రర్ : ఈ పెట్టి కేసులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పోలీసులు చండూరు రూరల్ ప్రాంతాల్లో ఈ పెట్టి కేసులు నమోదు చేస్తుండగా మున్సిపాలిటీ పరిధిలో టౌన్ న్యూసెన్స్ పెట్టి కేసులను నమోదు చేస్తున్నారు. పెట్టి కేసు నమోదు అయితే వేయి రూపాయలు పోలీస్ స్టేషన్లో జరిమానా కట్టడంతో పాటు కోర్టుకు వెళ్లి కేసును కొట్టివేయించుకోవాల్సి ఉంటుంది. రోడ్లపై అడ్డంగా వాహనాలను నిలపడం, తాగి గొడవలకు దిగడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ఇతర ఏదైనా సరే ప్రజా జీవనానికి ఆటంకం కలిగేలా ప్రవర్తిస్తే పెట్టి కేసు నమోదు చేస్తున్నారు. కేసుకు సంబంధించి ఫోటో కూడా తీస్తారు.
ఏదో వేయి రూపాయలు జరిమానే కదా అని పెట్టి కేసును ఆషామాషీగా తీసుకోవద్దు. ఒకసారి కేసు నమోదు అయిందంటే కోర్టుకు వెళ్లి కొట్టి వేయించిన సరే సదరు వ్యక్తి పైన కేసు ఉన్నట్లే లెక్క. ప్రభుత్వ ఉద్యోగాలకు గాని, పాస్ పోర్ట్,వీసా ఇతర విషయాలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నట్లయితే ఇబ్బందులు తప్పవు. కాబట్టి కేసు నమోదు కాకుండానే జాగ్రత్త పడాలి. చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఐదు కేసుల వరకు నమోదు అవుతున్నాయి. గత నెలలో 180 కేసుల వరకు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్. వెంకన్న తెలిపారు. నిత్యం తమ సిబ్బంది పహారా కాస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నిత్యం రెండు నుంచి మూడు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి…
‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?
వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?