ప్రతి సంతకంపై పైకం వసూళ్ళు..
క్రైమ్ మిర్రర్, మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం పంచాయతీ రాజ్ ఏ ఈ కృష్ణయ్య అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని మాడ్గుల మండల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. పైసల్ ఇస్తే తప్ప ఫైలు ఏం బి పై సంతకం పెట్టడం లేదని మాడ్గుల మండలంలో కొందరు తాజా సర్పంచులు పంచాయతీరాజ్ ఏఈ ఫై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మండలంలో తాజాగా జరుగుతున్న అభివృద్ధి పనులలో పర్సంటేజ్ ఇవ్వకుంటే పనూలు నాసిరకంగా ఉన్నావంటూ కొర్రీలు పెట్టి అక్రమంగా కాంట్రాక్టర్లు, సర్పంచుల వద్ద ఎంబిల పేరిట విచ్చలవిడిగా పైసలు వసూళ్ళు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరికొందరు సర్పంచులు అవినీతికి పాల్పడుతున్న పంచాయతీరాజ్ ఏఈ కృష్ణయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తక్షణమే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి పంచాయతీ రాజ్ ఏ ఈ పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండలం ప్రజలు వేడుకుంటున్నారు.
ALSO READ: Toll Plaza: నగదు లావాదేవీలకు పూర్తి స్థాయి గుడ్‌బై
