
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- పవన్ కళ్యాణ్, ప్రియాంక కాంబినేషన్ లో వచ్చినటువంటి OG సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదలై.. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఇప్పటికీ కూడా పలు థియేటర్లలో ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై దాదాపు పది రోజులు అవుతుండగా… ఇప్పటివరకు ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుంది అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు.
ఈ విషయంపై తాజాగా సినిమా వర్గాలు ఒక స్పష్టతనిచ్చాయి. ఈనెల 23వ తేదీన నెట్ఫ్లిక్స్ లో ఈ OG సినిమా స్ట్రీమింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి సుజిత్… ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్స్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ ను చూపించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం లో నటించినటువంటి అందరూ కూడా చాలా బాగా నటించి మెప్పించారు.
పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ లోనే ఈ సినిమా మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ఇక పవన్ కళ్యాణ్ ది మరో సినిమా పెండింగ్ లో ఉంది. ఆ సినిమా పేరే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మరికొన్ని నెలల్లోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతామని చెప్పిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే.
Read also : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే కాంగ్రెస్ కు షాక్.. నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేస్!
Read also : కారు ప్రమాదానికి ఈమె కారణం అంటూ సోషల్ మీడియాలో రచ్చ!