తెలంగాణ

జనజీవన స్రవంతిలో కలవండి: మావోయిస్టులకు రేవంత్‌ పిలుపు

  • రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

  • డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ: సీఎం రేవంత్‌

  • ఈగల్‌ ఫోర్స్‌ సమర్థంగా పనిచేస్తోంది: సీఎం రేవంత్‌

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, శాంతి, సహకారంతో రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రేవంత్‌ సూచించారు. గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారని ఆయన కొనియాడారు.

దేశంలో నెంబర్‌ వన్‌ తెలంగాణ పోలీస్‌

శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ ముందు వరుసలో ఉండటం గర్వకారణమన్నారు సీఎం రేవంత్‌. అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు పెరగకుండా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. ఈగల్‌ ఫోర్స్‌ అత్యంత పటిష్ఠంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని, ప్రజల భద్రతకోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తమవంతు కృషి చేస్తోందని రేవంత్‌ పేర్కొన్నారు. యువత డ్రగ్స్‌ బారిన పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ౠదునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని రేవంత్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి

  1. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : సీఎం
  2. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓకే… ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచుబోతుందా?
Back to top button