తెలంగాణ

తెలంగాణ హైకోర్టు నూతన సీజేఐగా కుమార్‌సింగ్‌

  • కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

  • త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కుమార్‌సింగ్‌

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు నూతన సీజేఐగా అపరేష్‌ కుమార్‌ సింగ్ నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు కుమార్‌ సింగ్‌. కాగా, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న సుజయ్ పాల్‌ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు.

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన అపరేష్‌ కుమార్‌ సింగ్‌ 1965 జులై 7 న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టభద్రులయ్యారు. 1990 నుంచి 2000 వరకు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జార్ఖండ్‌ హైకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశారు. 2012లో జార్ఖండ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కుమార్‌సింగ్ నియమితులయ్యారు. 2021 ఏప్ఇరల్‌ నుంచి జార్ఖండ్‌ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2022-23 వరకు జార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం 2023లో త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా కుమార్‌ సింగ్‌ పదోన్నతి పపొందారు.

Back to top button