
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో ట్రాప్ హౌస్ పార్టీ కలకలం రేపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇదే వార్త సంచలనం సృష్టిస్తుంది. దాదాపు 50 మందికి పైగా మైనర్లు గంజాయి అలాగే లిక్కర్ పార్టీ చేసుకుంటూ ఉండగా మొయినాబాద్ పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అనంతరం వీరందరినీ డ్రగ్స్ టెస్ట్ కు పంపించగా.. ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్లు రిపోర్టులో వెల్లడయింది. ఈ పోలీసుల తనిఖీల్లో భాగంగా ఆరు విదేశీ మద్యం బాటిల్లను అలాగే ఆరుగురు నిర్వాహకులను పట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే… హైదరాబాద్ కు చెందినటువంటి ఓ డీజే ఇన్స్టా యాప్ లో “ట్రాప్ హౌస్ 9mm” అనే పేరుతో ఒక వ్యక్తి ఎకౌంటును నిర్వహిస్తున్నాడు. ఇక మోయినాబాదులోని చెర్రీ ఫామ్ హౌస్ లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం చేసుకొచ్చాడు. ఈ పార్టీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది అని టైమింగ్స్ చెప్పుకొచ్చాడు. ఇందులో పాల్గొనాలంటే ఎంట్రీ పాసులు తీసుకోవాలని… ఒక్కరైతే 1600 వందలు అదే జంటగా వస్తే 2800 రూపాయలు అని ఆ ఎకౌంటు ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసినటువంటి మైనర్లు దాదాపు 50 మందికి పైగా శనివారం మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కి చేరుకొని మత్తులో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకేముంది… ఈ విషయం రాజేంద్రనగర్ SOT పోలీసులకు తెలియడంతో వెంటనే దాడులు నిర్వహించారు. ఈ పార్టీని నిర్వహిస్తున్న ఆరుగురు నిర్వాహకులతో పాటుగా ఆరు విదేశీ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Read also : చర్యలకు సిద్ధం… నేను కూడా రెడీ అంటున్న విజయ్
Read also : పొరపాటున తప్పు నెంబర్లకు డబ్బులు పంపించారా?… టక్కున ఈ నెంబర్లకు కాల్ చేయండి మీ సమస్యను తీర్చుకోండి!