క్రైమ్జాతీయం

దారుణం: తనకంటే అందంగా ఉన్నారని కసాయిగా మరిన తల్లి..!

పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకి...!

పానిపట్‌, క్రైమ్ మిర్రర్: తనకంటే అందంగా ఎవరూ కనిపించకూడదనే వికృత ఆలోచనతో ఓ తల్లి తన సొంత కుమారుడితో పాటు నలుగురు చిన్నారులను చంపేసిన ఘోర ఘటన హర్యానాలోని పానిపట్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణాలకు పాల్పడింది పూనమ్‌ అనే మహిళ అని పోలీసులు వెల్లడించారు. పోలీసుల ప్రకారం 2023లో తన వదిన కూతురిని అందంగా ఉన్నది అనే కారణంతో గొంతు నొక్కి చంపేసిందని విచారణలో వెల్లడించింది. ఆ ఘటనను తన పదిేళ్ల కుమారుడు చూశాడనే అనుమానంతో, నిజం బయటపెడతాడని భావించి, అతడినీ ప్రాణాలు తీశామని పూనమ్‌ అంగీకరించినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా, ఇటీవల మరో చిన్నారిని నీటి టబ్‌లో ముంచి చంపేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డాయి. దీంతో ఆమె నేరాలపై పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి.

అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారులు ఆటలో ప్రమాదవశాత్తు చనిపోయారు అన్న నెపం వేసే ప్రయత్నం చేసిందని అధికారులు తెలిపారు. కానీ కాలక్రమేణా చిన్నారుల మరణాల వెనుక ఒకే మహిళ ఉండటం పోలీసులు గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూనమ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆమె మానసిక పరిస్థితి, పూర్వపు మొక్కుబడులు, మరిన్ని కేసులపై కూడా పరిశీలన కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘోరాలు వెలుగులోకి రావడంతో పానిపట్‌ ప్రజలు షాక్‌కు గురై, చిన్నారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Back to top button