
గండిపేట్, క్రైమ్ మిర్రర్:- మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్లో ఏర్పాటుచేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కాశిగారి యాదగిరి హాజరయ్యారు. అనంతరం
బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్వ సత్యనారాయణ కాశిగారి యాదగిరి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజ సేవ, విద్యా వ్యాప్తి, సాంఘిక సంస్కరణల కోసం చేసిన కృషిని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలను ఈ తరం యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోట జగదీష్, గద్దె కృష్ణ, గద్దె యాదగిరి, మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వీడెం రమేష్, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్ కుమార్, మామిడిశెట్టి శ్రీనివాస్, గంజి ధనంజయ్, శిరం దాస్ ప్రభాకర్, ఉడుత సురేష్, కర్నాటి శ్రీనివాస్, ఏర్వ మహేష్, యాదగిరి భాస్కర్, గోపాల్, రాంచందర్, పిస్కె భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Read also : ప్రజల సమస్యల పరిష్కారానికి దశలవారిగా పరిష్కారం : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
Read also : తిరుమలలో భక్త “జనసంద్రం”