
Interesting fact: ప్రపంచం నలుమూలల ప్రజల జీవన శైలి, ఆచారాలు, సాంప్రదాయాలు, సిగ్గుపడే పద్ధతులు ఒక దేశం నుండి మరో దేశానికి విపరీతంగా మారుతూ ఉంటాయి. కొన్ని దేశాలలో చిన్న విషయానికే పెద్దగా సంకోచం (సిగ్గు) వ్యక్తం చేస్తే, మరికొన్ని దేశాలలో అలాంటి విషయాలను సాధారణంగా చూస్తారు. అయితే ప్రపంచంలోనే అత్యంత సిగ్గుపడే జాతిగా పేరుపొందిన ప్రజలు ఉన్న ఒక దేశం గురించి మనకు తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ దేశ ప్రజలు రోజువారీ జీవితంలో చూపించే ఆచారాలు, వారి దగ్గరి సంబంధాలలో పాటించే నియమాలు, భోజన పట్టికల దగ్గర జరిగే నిర్ణయాలు అన్నీ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
ఈ దేశంలో భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ఎంతో గౌరవనీయమైనదైనా, వారు చూపే సిగ్గు మాత్రం ప్రపంచంలో ఎక్కడా కనిపించని రీతిలో ఉంటుంది. ఒకే ఇంట్లో జీవించే భార్యాభర్తలు కూడా కలిసి భోజనం చేయడానికే సిగ్గుపడతారన్న విషయం మనకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు కూడా భార్యాభర్తలు పక్కపక్కనే కూర్చోరంటే, వారి సంప్రదాయాలు ఎంత భిన్నంగా ఉంటాయో అర్థమవుతుంది.
ఇక్కడ పబ్లిక్ ప్రదేశాలలో మహిళ, పురుషుల ప్రవర్తన చాలా నియంత్రణలో ఉంటుంది. ఉదాహరణకు, పురుషులు స్నానం చేసే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు పొరపాటున ఒక మహిళ వచ్చినా.. అక్కడున్న వారందరూ ఒక్కసారిగా లేచి వెళ్లిపోతారంటే వారి సంస్కృతిలో సిగ్గుకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తుంది. మహిళలు కూడా ఇలాంటి ప్రదేశాలకు అతి దగ్గరకు రావడమే తప్పుగా భావిస్తారు. భార్యలు తమ సొంత భర్తతో కలిసి స్నానం చేయడానికే సిగ్గుపడతారంటే, ఇది వారి సామాజిక మర్యాదలు ఎంత బలంగా ఉన్నాయో సూచిస్తుంది.
ఈ దేశపు ప్రజలు ఆకలిని బయట పెట్టడానికే భయపడతారు. ఆకలి వేసిందని చెప్పడం తమ సంస్కృతిలో అవమానకరంగా భావిస్తారు. ఎవరికైనా ఆహారం పెట్టడం కూడా తప్పుగా భావించడం వింతగా అనిపించినా, వారి ఆచారాల్లో అది అసభ్యంగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఎవరికైనా ఆకలి వేసినా, వారు దాన్ని బయటికి చెప్పకుండా తాము ఏదో రీతిలో భరించుకోవాల్సి వస్తుంది.
అయితే అతిథి మర్యాదలో మాత్రం వీరికి ప్రపంచంలో సాటి లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినా, వారిని ఎంతో ఆత్మీయంగా స్వాగతించడం, వెళ్లేటప్పుడు బహుమతులు ఇచ్చి మరీ పంపడం వీరి ఆచారం. ఇలాంటి అతిథి మర్యాద అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
ఈ దేశపు మహిళల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ దాదాపు ప్రతి మహిళ విగ్గులను వాడుతుంది. సహజ జుట్టు పొడవు తక్కువగా ఉండటం, పొట్టి జుట్టును తమకు నచ్చకపోవడంతో విగ్గులు ఇక్కడ ప్రధాన ఫ్యాషన్ అయింది. అందువల్ల, బట్టల షాపుల కంటే విగ్గుల షాపులు ఎక్కువగా కనిపిస్తాయి. విదేశాల నుండి కూడా విగ్గులను దిగుమతి చేసుకుంటూ ఉంటారు.
ఇక్కడి ప్రధాన ఆహారం నోసిమా. మొక్కజొన్నతో తయారు చేసే ఈ వంటకం ప్రజలకు ప్రధాన భోజనం. ప్రత్యేక వేడుకల సమయంలో అందరూ కలిసి ఒకే చోట కూర్చొని తినడం తప్పనిసరి. భోజనం పూర్తయ్యే వరకు ఎవరూ లేవరు. అలాగే రెండు చేతులతో తినడాన్ని పాపంగా భావిస్తారు. తమ ఆచారాల ప్రకారం ఇది ఆహారాన్ని అవమానించడమే అని భావిస్తారు.
ఇన్ని విశేషాలతో ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన దేశం జాంబియా. ఆఫ్రికా ఖండం తూర్పు భాగంలో ఉన్న ఈ దేశం వైశాల్యం 752,614 చదరపు కిలోమీటర్లు. లుసాకా రాజధానిగా, అతిపెద్ద నగరంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాన కాంగో, టాంజానియా, తూర్పున మలావి, ఆగ్నేయాన మొజాంబిక్, దక్షిణాన జింబాబ్వే, బోత్సువానా, నమీబియా సరిహద్దులతో ఉన్న ఈ దేశం సంస్కృతి ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.
ALSO READ: Dream Science: కలలో ఈ జంతువులు వస్తే అదృష్టం కలిసొస్తుందట!





