జాతీయం

ఇంటర్‌ పరీక్షలో ప్రశ్నపై పొలిటికల్‌ ఫైట్‌ - ఇంతకీ ఏంటా క్వశ్చన్‌..? ఏం అడిగారు..?

ఇంటర్‌ ప్రశ్నాపత్నంలోని ఒక ప్రశ్న… ఇప్పుడు పొలిటికల్‌ ఫైట్‌కు దారి తీసింది. ఒక పార్టీ గురించి ఎందుకు ప్రశ్న అడిగారని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే… అందులో తప్పేముందని అధికార పక్షం కౌంటర్‌ ఇస్తోంది. దీంతో.. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంత వివాదానికి దారి తీసిన ఆ క్వశ్చన్‌ ఏంటి…? అందులో ఏం అడిగారు. ఒకసారి చూద్దాం.

పంజాబ్‌లో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. సీఈసీ సెకండియర్‌ విద్యార్థులకు… ఈనెల 4న పొలిటికల్‌ సైన్స్‌ పరీక్ష జరిగింది. ఆ ప్రశ్నాపత్నంలోని ఒక ప్రశ్న.. ఇప్పుడు రాజకీయ వివాదానికి దారి తీసింది. ఆ క్వశ్చన్‌ ఏంటంటే… ఆమ్‌ ఆద్మీ పార్టీని ఎప్పుడు స్థాపించారు. ఆ పార్టీ విధివిధానాలు ఏంటి…?. ఈ ప్రశ్న ఇప్పుడు.. పంజాబ్‌లో పొలిటికల్‌ హీట్‌ రాజేసింది. పంజాబ్‌లో ప్రస్తుతం ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండగా… బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అయితే… ఇంటర్‌ ప్రశ్నాపత్నంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రశ్న ఎలా అడుగుతారని…. జాతీయ పార్టీ బీజేపీ గురించి ఎందుకు అడగలేదని కమలం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌లో పొలిటికల్‌ సైన్స్‌ చదివే విద్యార్థులకు… ఏడాది మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పాఠాలే చెప్పారా అంటూ నిలదీస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు ఇలాంటి ఛీప్‌ ట్రిక్స్‌ప్లే చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికార పార్టీ అయినంత మాత్రాన… విద్యావ్యవస్థను ఉపయోగించుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారంటూ… గట్టిగానే చాకిరేవు పెడుతున్నారు.

బీజేపీ విమర్శలకు…. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్‌ ఇస్తున్నారు. పొలిటికన్‌ సైన్స్‌ పేపర్‌లో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం సర్వసాధారణమని.. అందుకోసం బీజేపీ నేతలు ఇంతలా గింజుకోవాల్సిన అవసరం లేదన్నారు పంజాబ్‌ విద్యాశాఖ మంత్రి హర్నోత్‌ బెయిన్స్‌. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం.. బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button