ఆంధ్ర ప్రదేశ్

మంత్రి పదవిదేముంది...ముందుంది అసలైన ఆట - టీడీపీతో జతకట్టిందే అందుకట..!

ఏపీలో కూటమి పార్టీల మధ్య రాజకీయాలు రోజుకో ట్విస్ట్‌ ఇస్తున్నాయి. కూటమిలో మూడు పార్టీలు ఉంటే.. ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం. కలిసే ఉన్నామంటూనే… ఎవరికి వారు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఎవరి రాజకీయాలు వారు నెరుపుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు..?

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడంతో బీజేపీ నేత సోము వీర్రాజు ఆనందానికి అవధులు లేనట్టు కనిపిస్తోంది. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ఆనందంలో.. బీజేపీ భవిష్యత్‌ రాజకీయాల గురించి కూడా లీకులు ఇచ్చేశారు. మంత్రి పదవిపై తన ఆశ లేదని అసలు మంత్రి పదవిదేముందని ఏపీలో ఎన్డీయే కూటమి ఏర్పాటు, టీడీపీతో బీజేపీ జతకట్టడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని అన్నారు సోము వీర్రాజు. ఇదిగో ఈ మాటే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. సొంత లాభం లేకుండా బీజేపీ అడుగు ముందుకు వేయదన్న మాటను మరోసారి రుజువు చేసుకుందని విశ్లేషకులు అంటున్నారు. అంటే కూటమిగా ఏపీలో అధికారం పంచుకుంటున్న బీజేపీ నెమ్మదిగా బలం పెంచుకుని భవిష్యత్‌లో పవర్‌లోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. సోము వీర్రాజు స్టేట్‌మెంటే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.


Also Read : టీడీపీ క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి – కూటమి కల్లాసేనా..!


వాస్తవానికి టీడీపీతో బీజేపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ నేతల్లో సోము వీర్రాజు ముందు వరసలో ఉంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు టీడీపీ-బీజేపీ పొత్తు వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. అంటే ఒక ప్లాన్‌ ప్రకారమే కమలం పార్టీ సైకిల్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందు టీడీపీతో బీజేపీ పొత్తును వ్యతిరేకించిన సోము వీర్రాజు కూడా ఆ తర్వాత సైలెంట్‌ అయినట్టు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా దక్కడంతో ఆయన తెగ సంతోష పడుతున్నారు. అంతేకాదు భవిష్యత్‌ బీజేపీదే దేశంలో దమ్మున్న మొనగాడు ప్రధాని మోడీనే అంటూ భారీ డైలాగ్‌లు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button