జాతీయంరాజకీయం
Trending

ఢిల్లీలో ఉత్కంఠత!… కేజ్రీవాల్ వెనుకంజ !… కొద్దిసేపట్లో తేలిపోనున్న గెలుపోటములు ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో ఎప్పటికప్పుడు ఉత్కంఠత నెలకొంటుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీలో అధికారం దక్కేది ఎవరికో తేలిపోనుంది. బిజెపి మరియు ఆప్ పార్టీలు ప్రధానంగా పోటీలో నిలుస్తున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం బిజెపి బలంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు విడుదలైన ఎన్నికల ఫలితాలలో ఆపు పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ వెనకంజలో పడటం దీనికి నిదర్శనంగా మారింది. ఈ సమయంలో ఢిల్లీ అధికార పీఠం ఎవరిదో మరికొద్ది క్షణాల్లో తేలిపనుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా 19 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈసారి అత్యధికంగా ఢిల్లీలో 60 శాతం ఓటింగ్ నమోదు అయిన విషయం మనకి కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ప్రైవేట్ వీడియోల ప్రశ్నలపై స్పందించిన హీరో నిఖిల్!..

ప్రస్తుతం బిజెపి 43 స్థానాలలో ముందుంది. మరోవైపు ఆప్ పార్టీ 24 స్థానాలలో ముందుంది. ఇక ఇతర అన్ని పార్టీలు కలిపి ఒక స్థానంలో ముందున్నాయి. ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్కి ఒక సీట్ కూడా వచ్చేటట్టు లేదు. కాగా ఎలాగైనా బిజెపి గెలిచి అధికార పీఠం దక్కించుకోనున్నట్లుగా తెలుస్తుంది. గత సంవత్సరం 62 సీట్లతో భారీ మెజార్టీతో గెలిచిన ఆప్ పార్టీ ఈసారి మాత్రం ఓటమిని చవిచూడాల్సి వస్తుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ అనేది చాలా ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం లోపు అధికారం ఎవరిది అనేది తేలిపోతుంది.

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండదు!.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు?

నాకు ఎలాంటి అరెస్ట్ వారెంట్ రాలేదు!… ఫేక్ న్యూస్ నమ్మొద్దు?

Back to top button