తెలంగాణ

సదర్ సందడి 2025... యాదవ సోదరుల ఉత్సాహం

అందరినీ ఆకర్షిస్తున్న ఏడు అడుగుల దున్నపోతులు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : దీపావళి తర్వాత యాదవ సోదరులు నిర్వహించే సాంప్రదాయ సదర్ ఉత్సవం నగరంలో సందడిగా ముస్తాబవుతుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఉత్సవ వాతావరణం నెలకొంది. హర్యానా, బీహార్ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మహా దున్నపోతులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సదర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హరిబాబు మాట్లాడుతూ… ఈసారి సదర్ ఉత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించబోతున్నాం. బాద్షా, రోలెక్స్, బజరంగీ, గోలు, కోహినూర్ పేర్లతో ఉన్న ఈ దున్నపోతులు ఏడు అడుగుల ఎత్తుతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు,
అని తెలిపారు.

యాదవ సోదరులు ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం సదర్ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించడం హైదరాబాద్ ప్రత్యేకతగా మారింది. ఈ సందర్భంగా బుల్‌ ఎగ్జిబిషన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా వేడుకలు నగరానికి చక్కని ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి.

ALSO READ: తిరుమలలో దళారుల బెడదపై టీటీడీ చైర్మన్‌ ఆందోళన,

ALSO READ: బంద్ ఎఫెక్ట్… దీపావళి, దుకాణదారుల పై ప్రభావం చూపుతోందా?

Back to top button