క్రైమ్

ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాఫ్టర్, స్పాట్ లోనే ఏడుగురు..

Uttarakhand Helicopter Crash: అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదాన్ని మర్చిపోక ముందే, తాజా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. స్పాట్ లోనే ఐదుగురు చనిపోగా, మరో ఇద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. గౌరికుండ్, త్రిజుగి నారాయణ్ మధ్య.. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్ నాథ్ కు వెళ్తుండగా  ఘటన జరిగింది.

ప్రయాణీకులు ఎక్కడి వారంటే? 

ఆదివారం నాడు తెల్లవారు జామున 5.20 గంటల సమయంలో హెలికాప్టర్ కేదార్ నాథ్ ధామ్ నుంచి గుప్త్ కాశి బయల్దేరింది. గౌరికుండ్ సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్ తో పాటు మరో ఆరుగురు ప్రయాణీకులు ఉన్నారు. హెలికాప్టర్ లో వెళ్లే  ప్రయాణీకులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు.

సీఎం పుష్కర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలోనే ఐదుగురు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ప్రయాణీకులను హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. అటు ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, అప్పటికే ఐదుగురు చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చిపోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Read Also: బ్లాక్ బాక్స్ దొరికింది.. ప్రమాదానికి కారణం తేలిపోనుంది!

Back to top button