తెలంగాణ

ఖైరతాబాద్‌ గణేషుడి సన్నిధిలో మహిళ ప్రసవం

  • క్యూలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

  • రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తింపు

  • ఆనందం వ్యక్తం చేస్తున్న మహిళ బంధువులు

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రజలు తండోపతండాలుగా తరలివస్తుండటంతో క్యూ మొత్తం నిండిపోయింది. గణనాథుడి దర్శనం కోసం కుటుంబంతో కలిసి వచ్చిన ఓ గర్భిణి… క్యూలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. లైన్‌లో నిల్చుండగానే గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. పక్కనే ఉన్న తోటి మహిళలు ఆ గర్భిణికి పురుడు పోశారు. అనంతరం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్యూలో ప్రసవించిన మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. ఖైరతాబాద్‌ గణపయ్య సన్నిధిలో పురుడు పోసుకోవడంతో రేష్మ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:

  1. ఐపీఎల్‌కు అశ్విన్‌ గుడ్‌బై
  2. బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు.. ఎంపిక ఎప్పుడంటే?
Back to top button