ఆంధ్ర ప్రదేశ్

నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!… రాష్ట్రంలో కొత్తగా 20వేల ఉద్యోగాలు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎలక్షన్లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి సర్కార్ ముందడుగు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేడు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో యువతకు 20వేల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు.

రంజీల్లో పాదాలు మోపిన కోహ్లీ!… కేరింతలతో అభిమానులు స్వాగతం?

తాజాగా 15 ప్రాజెక్టులకు సంబంధించి కీలక పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విలువ అక్షరాల 44,776 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన పోటీ నెలకొన్న సందర్భంలో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లు అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. త్వరగా రాష్ట్రస్థాయిలో అనుమతులు మరియు క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

డాక్టర్ నిర్లక్ష్యం!.. బలైన మహిళ నిండు ప్రాణం?

ఢిల్లీ గణతంత్ర పరేడ్ వేడుకలు!.. మూడో స్థానంలో నిలిచిన ఏపీ?

Back to top button