
-
బుడిబుడి అడుగులతో తండ్రికి వీడ్కోలు..
-
బాబాయ్ చేయి పట్టుకొని తలకొరివి..
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, ఎడ్ల సురేష్ 32 సోమవారం మృతి చెందారు. అనారోగ్యం కారణంగా మరణించిన సురేష్ కు, భార్య ఒక కుమారుడు(8), వృద్ధ వయసు గల తల్లి ఉన్నారు. సురేష్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మొదటి నుండే విరిది భీధ కుటుంబం కావడంతో, అతని మృతి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. గ్రామ ప్రజలు తోచిన సహాయం చేస్తున్నప్పటికి, వారి కుటుంబం నిలబడటానికి అందరి సహాయం అవసరమని గ్రామస్థులు కోరుతున్నారు. తోచిన సహాయంతో కుటుంబానికి అండగా నిలబడాలని కుటుంబికులు కోరుతున్నారు..
ఏమి తెలియని వయసులో, బాబాయ్ చెయి పట్టుకొని, పాడెకు ముందు నడుస్తున్న బాలుడి నడక అందరిని కదిలించింది.. ఊహ తెలియని వయసులోనే తండ్రి మరణం, ఆ బాలుడి భవిష్యత్తును ఎలా రాయనుందో కాలం..





