Tuesday, February 24, 2026
HomeరాజకీయంT20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జగన్ కు లోకేష్ కౌంటర్

T20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జగన్ కు లోకేష్ కౌంటర్

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కు మంత్రి నారా లోకేష్ కొలంబోకు వెళ్లిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై మరుసటి రోజు వైఎస్ఆర్సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. నారా లోకేష్ పై కౌంటర్లు వేశారు. ఇతను ఒకరోజు విజయవాడ మరో రోజు హైదరాబాద్ ఇంకో రోజు క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ప్రభుత్వ విమానాలు అలాగే హెలికాప్టర్లను ఉపయోగిస్తూ జల్సాలు చేస్తున్నారు అని ఆరోపించారు. పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వాటికోసం కూడా జల్సాలు చేస్తారా?.. అని ప్రశ్నించారు.

అయితే ఇదే విషయంపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ వైఎస్ జగన్కు రీకౌంటర్ వేశారు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా జట్టు ఫైనల్ కు వెళుతుందని.. ఆ మ్యాచ్ కు కచ్చితంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారికి టికెట్ కొంటాను అని మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ సెటైర్ వేశారు. నాకు దేశమంటే భక్తి ఉంది .. మన భారత క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్ జరిగినా చూడడానికి నేను వెళ్తాను అని అన్నారు. వీటి కోసం ప్రభుత్వ సొమ్మును ఒక రూపాయి కూడా వినియోగించను అని అసెంబ్లీ వేదికగా జగన్ కు వివరణ అనేది ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకొని మాట్లాడాలి అని జగన్ కు సూచించారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments