
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ప్రస్తుతం ఏ థియేటర్ కు వెళ్ళినా కూడా అక్కడ సినిమా రేట్ల కంటే.. థియేటర్లలో అమ్మేటువంటి తినుబండారాల ధరలే ఎక్కువగా ఉన్నాయి అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా థియేటర్లలోని తినుబండారాలపై ఏకంగా సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ తో పాటు థియేటర్లలోని తినుబండారాల ధరలు భారీగా పెంచడంపై సుప్రీంకోర్టు మండిపడింది. బడా హీరోలా సినిమా మొదటి రెండు రోజుల్లో టికెట్ ధర 1000 నుంచి దాదాపు 2000 రూపాయల వరకు ఉంటుంది. వాటితో పాటుగా ఇంటర్వెల్ సమయంలో థియేటర్లో ఉన్నటువంటి తినుబండారాలు కొనుగోలు చేయాలంటే మరో 200 నుంచి 400 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ధరలను నియంత్రించకపోతే సినిమా హాల్స్ త్వరలోనే ఖాళీగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. కర్ణాటక రాష్ట్రంలో మూవీ టికెట్ ధరలను 200 రూపాయలకు పరిమితం చేయడంతో మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. థియేటర్లలో తినుబండారాల ధరలు ఇకనైనా తగ్గించాలి అని సూచించారు. లేదంటే స్టార్ హీరోల సినిమాలుకు తప్పించి చిన్న హీరో సినిమాలకైతే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే అవకాశాలు లేవు. దీంతి థియేటర్లు మూసుకునే అవకాశాలు ఉన్నాయని సుప్రీం కోర్టు వెల్లడించింది.
Read also : మణికొండలో కాల్పుల కలకలం..!
Read also : బీహార్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా!





