
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు అలాగే ప్రజలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టారు. ఈ స్థానిక ఎన్నికలలో మండలం, గ్రామాలలో ఎటువంటి ఉత్కంఠత నెలకుంటుందో అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల సుప్రీంకోర్టు కేసులు కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా బ్రేక్ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం కలుపుకొని 14 ఎంపీటీసీ స్థానాలు, 27 సర్పంచ్ స్థానాలు, 256 వార్డుల స్థానాలు ఈసారి ఎన్నికలకు దూరం కానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ములుగు జిల్లా, మంగపేట మండలంలో ఈసారి 14 ఎంపీటీసీ స్థానాలు, 25 సర్పంచ్ స్థానాలు, 230 వార్డుల స్థానాలకు ఎన్నికలు జరగడంలేదు. ఎందుకంటే 15 ఏళ్ల నుంచి ట్రైబల్, నాన్ ట్రైబల్ పంచాయితీ వల్ల ఈ ఎన్నికలు జరగడం లేదని అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఇక కరీంనగర్ జిల్లాలో రెండు, మంచిర్యాలలోని గూడెంలో ఈసారి కూడా ఎలక్షన్స్ కు దూరము అవుబోతున్నాయి. ఇక మిగతా అన్నిచోట్ల కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల అధికారులు మరియు నాయకులందరూ కూడా ఈ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఆయా పార్టీల బలాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
Read also : కేవలం నాలుగు రోజుల్లోనే 800 కోట్లు సంపాదన.. మద్యం అమ్మకాలలో రికార్డ్!
Read also : ఆహా రూమర్స్… చివరికి ఎంగేజ్మెంట్ తో ఒకటైన రష్మిక, విజయ్ దేవరకొండ!