అంతర్జాతీయంజాతీయం

రేపు సాయంత్రం 5:57కి భూమ్మీదకు సునీత - ఎన్నాకెన్నాళ్లకు..!

స్పేస్‌ నుంచి 9 నెలల తర్వాత.. భూమ్మీద అడుగుపెట్టబోతున్నారు వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌. ఎప్పుడెప్పుడు.. వారు భూమి మీదకు వస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కూడా ఎంతో ప్రయత్నించారు. ఇప్పటికి…. వారు చేసిన ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. సరిగ్గా… రేపు సాయంత్రం 5గంటల 57 నిమిషాలకు సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ భూమి మీదకు వస్తారని నాసా ప్రకటించింది.

నలుగురు వ్యోమగాములతో ప్రయోగించిన స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంతో… సునీత, విల్‌మోర్‌ చేసిన అంతరిక్ష వాసానికి ఎండ్‌ కార్డ్‌ పడుతోంది. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చే స్పేస్‌ ఎక్స్‌ క్రూ-9 మిషన్‌ను.. ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్టు నాసా తెలిపింది. అమెరికా టైమ్‌ ప్రకారం… సోమవారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ప్రక్రియ మొదలవుతుంది. సోమవారం అర్థరాత్రి 12 గంటల 45 నిమిషాలకు స్పేస్‌ సెంటర్‌ నుంచి వ్యోమనౌక అన్‌డాకింగ్‌ ప్రక్రియ స్టార్ట్‌ అవుతుంది. స్పేష్‌షిప్‌ విజయవంతంగా విడిపోయిన తర్వాత… రేపు సాయంత్రం 4గంటల 45 నిమిషాలకు వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణం అవుతుంది. రేపు సాయంత్రం 5గంటల 11 నిమిషాలకు భూకక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 5గంటల 57 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జాలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ దిగుతుంది. అందులో నుంచి వ్యోమగాములను బయటకు తీసుకొస్తారు.

Read More : కేసీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన రేవంత్‌రెడ్డి – జగన్‌కు కూడా వర్తిస్తుందా..?

గత ఏడాది జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో సునీత, విల్‌మోర్‌… అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారం రోజుల్లో తిరిగి భూమి మీదకు రావాల్సిన వారు… స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో… అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయారు. వారిని తీసుకొచ్చేందుకు పలు మార్లు ప్రయత్నించినా ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు.. ఆ సమయం వచ్చింది. మరికొన్ని గంటల్లో వారు భూమి మీదకు రాబోతున్నారని తెలిసి… అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. ప్రపంచంలోనే టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్!… సగం ఇండియాలోనే?

  2. అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గరు మృతి!

  3. కెసిఆర్ జాతిపిత… రేవంత్ రెడ్డి బూతు పిత: హరీష్ రావు ..

  4. సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమ జర్నలిస్టుల వార్నింగ్

  5. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రెండేళ్లలో అమరావతి నిర్మాణం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button