
క్రైమ్ మిర్రర్, వలిగొండ :- భువనగిరి జిల్లా,వలిగొండ పట్టణ కేంద్రంలోని గాయత్రి హై స్కూల్ విద్యార్థులతో వలిగొండ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ సాంఘిక మాద్యమం సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకుని చాటింగ్ లు, మీటింగ్ లతో జీవితాలని నాశనం చేసుకోవద్దని తెలియబరుస్తూ, విద్యార్థులతో ర్యాలి చేయడం జరిగింది.మీ ఉజ్వల భవిష్యత్తుకై పాటుపడుతూ,మీ తల్లిదండ్రుల మాట గౌరవిస్తూ, ఉపాధ్యాయుల మాట వింటూ,సమాజం లో తోటి వారిని గౌరవిస్తూ మీరు మీ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిస్సందేహంగా చెప్పొచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,యాజమాన్యం,ఉపాధ్యాయులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read also : క్రికెట్ ఆడుతున్న సమయంలో టాయిలెట్ వస్తే ఎలా..?
Read also : ఒక్కొక్క కుటుంబానికి 3000 రూపాయలు, 25 కేజీల బియ్యం : సీఎం





