Homeతెలంగాణఎన్నికల సిబ్బందిపై ఎవరైనా సరే దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి : డీజీపీ శివధర్...

ఎన్నికల సిబ్బందిపై ఎవరైనా సరే దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి : డీజీపీ శివధర్ రెడ్డి

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపై అలాగే పోలీసుల పై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభ్యర్థులు లేదా ఏ పార్టీ కార్యకర్తలు అయినా సరే చట్టానికి అతీతులు కారు అని అన్నారు. ఎవరైనా సిబ్బంది పొరపాట్లు చేస్తే తక్షణమే ఎలక్షన్ కమిషన్ అధికారులకు లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఇప్పటికే ఈ ఎన్నికలలో భాగంగా పోలీసులు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మీద చాలామంది దౌర్జన్యాలు చేసిన కేసులు ఉన్నాయి అని.. ఈ కేసుల విచారణ అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలి అని ఎస్పీలను ఆదేశించారు. ఇక ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆయా చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

CM Revanth Reddy: 2028లో కాదు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే

Sinkhole: అకస్మాత్తుగా భూమిలోకి కుంగిపోయి, అదృశ్యమైన రోడ్డు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments