
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. వందల కోళ్ళు పొలాల్లోకి రావడంతో ఆ కోళ్లను పట్టుకోవడానికి ప్రజలు కూడా అదే విధంగా ఎగబడ్డారు. దొరికిన వారు దొరికినన్ని కోళ్లు సంచులలో వేసుకొని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తి మరియు సిద్దిపేట నేషనల్ హైవే వెంబట 100కు పైగా నాటు మరియు బ్రాయిలర్ కోళ్లను వదిలిపెట్టి వెళ్ళారు. కొద్దిసేపటికి ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోళ్లను పట్టుకోవడానికి పొలాల్లోకి పరిగెత్తుకు వెళ్లారు. దొరికిన వారు దొరికినన్ని కోళ్లు పట్టుకొని వారి వెంట తెచ్చుకున్న గోనె సంచులలో వేసుకొని వెళ్లిపోయారు. కొంతమందికి పదుల సంఖ్యలో కోళ్లు దొరకగా.. మరి కొంతమందికి ఒకటి,రెండు కోళ్ళు దొరికాయి. ఇంకేముంది చక్కగా తీసుకొని.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అన్ని కోళ్లను ఎవరు, అసలు ఎందుకు వదిలి వెళ్లారు?.. అనేది ఒక ప్రశ్నగా మారింది. ఇక ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా సమాచారం.
Read also : నేను కాదు.. మీరే బ్యాడ్ బ్రదర్స్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Read also : అమ్మానాన్న మీ కలలను నెరవేర్చలేకపోయా.. “నన్ను క్షమించండి” అంటూ నీట్ విద్యార్థి ఆత్మహత్య!





