HomeతెలంగాణTGSRTC: ఉద్యోగులకు ఊరట...!

TGSRTC: ఉద్యోగులకు ఊరట…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: TGSRTC ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న 2.1% కరవు భత్యం (DA) పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2.1% డీఏను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ జూన్ 2022 నుండి అమలులోకి రానుంది.

ఈ నిర్ణయం ద్వారా సంస్థలోని సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగులు మరియు కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఈ 2.1% పెంపునకు సంబంధించిన బకాయిలను (Arrears) కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు