
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:- జయశంకర్ జిల్లా,మహాదేవపూర్ మండలంలోని సూరారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సిబ్బంది కొరతతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద కస్టమర్లకు సేవలు అందడంలో ఆలస్యం అవుతుంది. ఇది బ్యాంకు కార్యకలాపాలపై, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ సేవపై ప్రభావం చూపుతోంది. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల కస్టమర్లు కేవైసి లోన్ అప్లికేషన్లు, ఇతర లావాదేవీల కోసం రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఒకే ఉద్యోగి అనేక పనులు చేయాల్సి రావడం వల్ల, కస్టమర్ సర్వీస్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఉన్న సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడుతుంది, ఇది సేవ నాణ్యతను తగ్గిస్తుంది, ఫలితంగా కస్టమర్లు అసంతృప్తి చెందుతున్నరు. సూరారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించుకుని ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించుకోవాలనుకునే చిన్న, మధ్యతరగతి వ్యాపారస్తులు సిబ్బంది కొరత కారణంగా మహాదేవపూర్, కాటారంలోని ఇతర బ్యాంకుల సేవలను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది.
Read also : నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఎన్ని రోజులు పూర్తి వివరాలు..!
Read also : రాత్రిపూట సరిగా నిద్ర పట్టట్లేదా.. అయితే ఈ పని చేయండి?





