క్రైమ్

కల్తీ మద్యం కలకలం: హైదరాబాద్‌లో 11 మంది అస్వస్థత, ఒకరు విషమం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కల్తీ మద్యం మరోసారి ప్రాణాంతకంగా మారింది. కల్తీగా తయారైన కల్లు తాగిన 12 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వీరికి విరోచనాలు, బీపీ పడిపోవడం లాంటి లక్షణాలు కనిపించాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఈ సంఘటన కూకట్ పల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురైన వారిని స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది జిహెచ్ఎంసి ఎంహెచ్ఓకు సమాచారం అందించారు. కల్తీ మద్యం ఎక్కడ తయారయింది, ఎక్కడ నుండి తెచ్చారు అనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button