Saturday, March 28, 2026
Homeఆంధ్ర ప్రదేశ్నేటి నుండి "ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ" లకు క్రీడా పోటీలు..!

నేటి నుండి “ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ” లకు క్రీడా పోటీలు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రము ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మార్చి 28 మరియు 29 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి మరియు మార్చి మొదటి వారంలో ఇవి విజయవంతంగా పూర్తయ్యాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రజాప్రతినిధుల కోసం ఈ ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీలు ఎల్బీ స్టేడియం (LB Stadium) లో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్రీడలను ప్రారంభించనున్నారు.

క్రీడా పోటీలు ఎల్బీ స్టేడియం (LB Stadium) లో, సాంస్కృతిక కార్యక్రమాలు రవీంద్రభారతి లో జరుగుతాయి. అథ్లెటిక్స్, క్రికెట్ వంటి 8 రకాల క్రీడలతో పాటు నాటక ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని కమిటీ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments