Tuesday, March 10, 2026
Homeతెలంగాణసమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా : ఎస్పీ పవార్..

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా : ఎస్పీ పవార్..

నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. కనగల్ మండలంలో సమస్యాత్మక గ్రామమైన, జి.ఎడవెల్లిని సందర్శించి అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రజలు, యువకులతో ఎన్నికల నియమాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ పవార్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో, తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, పోలీస్ యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తుందని, ఎవరైనా గొడవలకు కారకులు అయితే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read also : Gold RateToday: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?

ఎన్నికల సమయంలో అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధమని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టి మధ్యం, నగదు ఉచితాలు పంపిణి చేయకూడదన్నారు. ఎవరైనా అలాంటి చర్యలు చేస్తూ పట్టుబడితే, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ ప్రజలకు ఎస్పి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డియస్పి శివరాంరెడ్డి, చండూరు సిఐ ఆదిరెడ్డి, కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి, ప్రశాంత్, గ్రామ ప్రజలు, యువత, తదితరులు పాల్గొన్నారు.

Read also : MEA: ఇండియా నుంచి చైనాకు వెళ్తున్నారా? అయితే, కాస్త జాగ్రత్త!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments