
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పుర్ ప్రతినిధి:-
భాగస్వామ్య పింఛను పథకం (సి పి ఎస్)రద్దు కావాలని శ్రీ కనకాల కట్ట మైసమ్మ తల్లి కి ప్రత్యెక పూజలు చేసినట్టు అల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ తెలిపారు.లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు లో ఉన్న కనకాల కట్ట మైసమ్మ ఆలయం లో సీ పీ ఎస్ రద్దు కోరుతూ..శుక్రవారం నాడు సి పి ఎస్ రద్దు కావాలన్న తను అభిమతం నెరవేరాలని కోరుతూ.. ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం మే 15 న ఛలో వారణాసి కార్యక్రమం తలపెట్టామని,అది విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. పాలకులు ఎప్పటికప్పుడు సి పి ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి పబ్బం గడుపు కుంటున్నారే తప్ప. పట్టించుకోవడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.సి పి ఎస్ రద్దు అన్న అంశం దైవాధీనం అయ్యిందని అందుకే.. పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్దరించేలా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ.. ఆలయాల్లో పూజలు చేస్తున్నామని రఘునందన్ తెలిపారు.ఆలయ ప్రధాన అర్చకులు గుమ్ముడ వెళ్ళి సాత్విక్ శర్మ రఘునందన్ కు అమ్మ వారి విశేష వస్త్రం బహుకరించారు.సి పి ఎస్ రద్దు కావాలన్న అభిమతం నెరవేరాలని, పాత పింఛను పథకం పునరుద్ధణ కోసం జరిప తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఆశీర్వదించారు.