
క్రైమ్ మిర్రర్, కామారెడ్డి జిల్లా :-
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం అత్తను అల్లుడు చంపిన ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….గ్రామానికి చెందిన జోన్నా లక్ష్మి(43) ఆమె అల్లుడు బాగా రాజు కు పండించిన జొన్న పంట డబ్బుల గురించి ఈరోజు ఉదయం గొడవ జరిగిందని,గ్రామస్తులు సర్ది చెప్పడంతో వెళ్లిపోయిన బాగా రాజు ఆమె అత్త జొన్న లక్ష్మి మధ్యాహ్నం పాఠశాలలో వంట చేసి తిరిగి వస్తున్న క్రమంలో కాపు కాసిన ఆమె అల్లుడు బాగారాజు కమ్మ కత్తితో దాడి చేసి చంపేశాడని స్థానికులు తెలిపారు.అప్పటికే ఆమె మృతి చెందడంతో,స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఇలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు.హత్య చేసిన తీరును పరిశీలించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డీఎస్పీ వెంట బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్,పిట్లం ఎస్సై రాజు,పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై… తొలి డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ యువ కెప్టెన్
జగన్, చంద్రబాబుకు పార్టీలు అండగా నిలబడినట్టు.. నాకు మా పార్టీ నిలబడలేదు: కల్వకుంట్ల కవిత