
క్రైమ్ మిర్రర్,అమరావతి బ్యూరో:- నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా మారుతుంది అని కొద్దిరోజుల నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఈ తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారి.. అర్ధరాత్రి నుంచి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక కాకినాడ, కోనసీమ పశ్చిమగోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ తుఫాన్ చెన్నైకి 640 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకు 740 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 710 కిలోమీటర్ల దూరంలో ఏర్పడి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read also : తుఫాన్ ఎఫెక్ట్ AP కే కాదు… తెలంగాణకు కూడా?
ఇప్పటికే హోం మంత్రి అనిత తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నై ప్రాంతాల నుంచి నేవీ హెలికాప్టర్లను కూడా రప్పిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ తుఫాన్ కాకినాడ తీరం దాటే అవకాశాలు కనిపిస్తుండడంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని… ముందస్తు జాగ్రత్తగా మూడు వేల స్తంభాలను కూడా సిద్ధం చేసి ఉంచామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ఇక ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ వర్షాలపై అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
Read also : మద్యం మత్తులో జల్సాలు చేసేవారు టెర్రరిస్టులతో సమానం : సజ్జనార్





