Sunday, March 22, 2026
Homeజాతీయంరాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమందంటే?

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమందంటే?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై రాత్రి పూట చాలా ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఏదో ఒక పనిలో బిజీ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. పూట గడవాలన్నా, నాలుగు రాళ్లు సంపాదించాలన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే. కాలంతోటే మనుషులు కూడా మారిపోయారు కాబట్టి ఈ యుగంలో యువత అందరూ కూడా మొబైల్ ఫోన్స్ కు బాగా అలవాటు పడిపోయారు. దీంతో రాత్రిపూట 12 గంటలకు లేదా ఒంటిగంటకో నిద్రపోతున్నారు. అయితే ఇలా రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోతే గుండెకు ఎంత ప్రమాదమో తాజాగా “జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్” స్టడీ ప్రకారం కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఎవరైతే రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారు ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా గుండె సమస్యలు వస్తాయి అని తెలిపింది. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో హార్ట్ ఎటాక్ అలాగే స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉంటుంది అని తెలిపింది. బాడీ క్లాక్ దెబ్బ తినడమే దీనికి ప్రధాన కారణం అన్నారు. తద్వారా రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేటువంటి వారికి గుండె జబ్బుల రిస్క్ ఇతరుల కంటే 16% ఎక్కువగా ఉంటుంది అని తెలిపింది. ఆరోగ్యమైనటువంటి మనుషులు సైతం తను చేసేటువంటి పనుల ద్వారా గుండె సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ప్రతిరోజు సరైన నిద్ర లేకపోవడం, వ్యాయమం చేయకపోవడం,ఎక్కువగా స్మోకింగ్ కు అలవాటు పడ్డవారికీ ఈ గుండె సమస్యలు పెరుగుతాయి అని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి రాత్రి సమయంలో ఎంత త్వరగా నిద్రపోతే ఎంత మంచిది. లేదంటే కచ్చితంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోక తప్పదు.

Read also : అభిషేక్ శర్మ పై జోష్యం చెప్పిన రికీ పాంటింగ్?

Read also : దురంధర్ మూవీ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా..?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments