కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో ఖరీదైన భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు జెండా పాతేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు స్పష్టించి భూములు కబ్జా చేస్తున్నారు. ఇలానే శ్రీ వివేకానంద నగర్ రోడు నెంబర్ 7లో దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు స్కెచ్ వేశారు. ప్లాట్ నెంబర్ 452 భూమికి ఏ. ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి అసలు ఓనర్. అతని దగ్గర పక్కా డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. కానీ మరో వ్యక్తి ఈ భూమి తనదేనంటూ ఈ భూమిలో షెడ్డు నిర్మించడానికి వచ్చాడు. అతను కూడా కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తున్నాడు.
అయితే ఈ భూమి ఏ. ప్రేమ్ రాజ్ కు చెందినదని.. ఆ భూమికి అటుఇటుగా ఉన్న ఇండ్ల యజమానులు చెబుతున్నారు. చాలా సార్లు వచ్చి భూమి చూసుకుని వెళ్లాడని అంటున్నారు. కొత్తగా భూమి తనదంటూ వచ్చిన వ్యక్తిని తాము గతంలో ఎప్పుడు చూడలేదంటున్నారు. ప్రేమ్ రాజ్ దగ్గర ఉన్నవే అసలైన డాక్యుమెంట్లు అని.. కొత్త వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లతో ల్యాండ్ కబ్జాకు స్కెచ్ వేశారని కాలనీ వాసులు చెబుతున్నారు.
Read More : పాఠం చెప్పడం మానేసి పాడు పని…బాలికతో అద్యాపకుడి అసభ్య ప్రవర్తన..!
కాలనీ అసోసియేషన్ కు చెందిన కొందరు నేతలు కబ్జాదారుడికి వంత పాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని విలువైన భూమి కబ్జాకు కాలనీకి చెందిన నేతలే స్కెచ్ వేశారని రోడ్ నెంబర్ 7 కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి కబ్జాదారులకు దక్కకుండా అసలైన యజమానికే ఇవ్వాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు కాలనీ లీడర్లు కబ్జాదారులకు సపోర్ట్ చేయడంపై శ్రీ వివేకానంద నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులను తరమికొట్టకపోతే ఇలాంటి ఘటనలు పెరిగిపోతాయని… భూములు కొన్న అసలు వ్యక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు.