ఒంటరి జంటలే ఆ ముఠాల టార్గెట్‌

  • వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్‌
  • పోలీసులు అదుపులో నిందితులు
  • వారి సెల్‌ఫోన్‌ల‌లో విస్తుపోయే వీడియోలు

విజయవాడ, క్రైం మిర్ర‌ర్ః

ఎన్టీఆర్ జిల్లా నందిగామ‌లో దారుణం చోటు చేసుకుంది.

ఏకాంతంగా ఉన్న ఒంట‌రి జంట‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వీడియోలు తీస్తూ త‌రువాత వారిని బ్లాక్ మెయిల్‌కు చేస్తూ డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొంత మంది యువ‌కులు గొడ‌వ‌పడుతున్న‌ట్లుగా పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో అక్క‌డి వెళ్లి వారిని అదుపు లోకి తీసుకొని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని చూడ‌గ పోలీసుల‌కు విస్తుపోయే వీడియోలు బ‌య‌ట‌ప‌డ్డాయి..

ఈ ముఠా అరాచ‌కాలు తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. ఈజీగా మ‌ని సంపాదించాల‌నే దురుద్దేశంతో వీడియోలు తీస్తూ త‌రువాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డ‌బ్బులు దండుకుంటున్న‌ట్లుగా తేలింది.

మ‌ద్యానికి బానిసైన యువ‌కులు ఈజీగా మ‌నిగా సంపాదించాల‌నే ఒంట‌రి జంట‌ల‌ను టార్గెట్ చేస్తూ వీడీయోలు తీస్తూ త‌రువాతవారికి చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఖాళీ ప్ర‌దేశాల్లో ఒంట‌రి జంట‌ల‌ను గ‌మ‌నించ‌డం ఆ త‌రువాత వీడియోలు తీయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు.

వీరి సెల్‌ఫోన్‌ల‌లో చాలా వీడియోలు ఉన్న‌ట్లు డ‌బ్బులు బాగానే డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button