సింగరేణి రిటైర్ట్ కార్మికుల‌కు 10వేలు పెంచాలి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, క్రైమ్ మిర్ర‌ర్ః సింగ‌రేణి రిటైర్ట్ కార్మికుల‌కు రూ. 10 వేల వ‌ర‌కు పెంచాల‌ని శ‌క్తివంచ‌న లేకుండా పోరాడుతున్నాన‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీక్రిష్ణ అన్నారు.

ఈ సంర‌ద్భంగా ఆయ‌న ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ సింగ‌రేణి రిటైర్ట్ ద్యోగులకుసంబంధించి పెన్ష‌న్ పెంపుద‌ల చేయాల‌ని పోరుడుతున్న త‌రుణంలో కేంద్రం నుంచి కీల‌క స్పంద‌న వ‌చ్చింద‌ని తెలిపారు.

పెన్ష‌న్ పెంపుద‌ల విష‌యంపై కేంద్ర బొగ్గు గనుల శాఖకు లేఖ రాసి, పెన్షన్ పెంపు, యాక్చురియల్ రీఅసెస్మెంట్ నిర్వహించాలని కోరిన‌ట్లు తెలిపారు.

ఈ లేఖకు తాజాగా స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ రూపిందర్ బ్రార్, గతేడాది డిసెంబర్ 22న సీఎపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశం నిర్వహించామని లేఖలో వెల్లడించారు.

ఆ సమావేశం లో పెన్షన్ నిధి మూల్యాంకనంతో పాటు యాక్చురీని నియమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ యాక్చురీ రిపోర్ట్ ఆధారంగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ సవరణ చేపట్టనున్న‌ట్లు ఆయ‌న‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button