-
నల్లగొండ జిల్లాలో పలువురు ఎస్ఐల బదిలీలు..!
-
వాడపల్లి, మిర్యాలగూడ రూరల్, వేములపల్లికి కొత్త ఎస్ఐలు
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: నల్లగొండ జిల్లా లో పోలీస్ శాఖ పరిధిలో పలువురు సబ్ఇన్స్పెక్టర్ల (SI) స్థానాల్లో మార్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా మూడు పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్ఐలను నియమించగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న పలువురిని వీఆర్ (VR)కు అటాచ్ చేసినట్లు తెలిసింది.
-
బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి..
వాడపల్లి ఎస్ఐగా ఎన్. ధర్మా: వాడపల్లి ఎస్ఐగా ఎన్. ధర్మాను నియమించినట్లు సమాచారం. అక్కడ అటాచ్‌మెంట్‌పై ఎస్ఐగా పనిచేస్తున్న సైదులును వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.
మిర్యాలగూడ రూరల్ ఎస్ఐగా యు. నగేష్: మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా యు. నగేష్‌ను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న లక్ష్మయ్యను వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.
వేములపల్లి ఎస్ఐగా సురేష్ రెడ్డి: వేములపల్లి ఎస్ఐగా సురేష్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వర్లును వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.
