Monday, March 23, 2026
Homeసినిమాచావు బతుకుల్లో ఉన్న చిన్నారిని కాపాడిన శృతిహాసన్?

చావు బతుకుల్లో ఉన్న చిన్నారిని కాపాడిన శృతిహాసన్?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :- ఈ మధ్యకాలంలో అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అనే సామెత ప్రతి ఒక్కరు వినే ఉంటారు. కానీ అందుకు భిన్నంగా కొంతమంది సినిమా సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు అడగకపోయినా కూడా వారి కష్టాలను తెలుసుకొని సహాయం చేస్తూ ఉంటారు. ఈ కోవలోకే తాజాగా శృతిహాసన్ చేరారు. ఈ హీరోయిన్ MSMD అరుదైన జబ్బుతో బాధపడుతూ.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆల్వి అనే ఒక చిన్నారి పుట్టుకతోనే ఎమ్మెస్ఎండి అనే జన్యు వ్యాధితో బాధపడుతూ ఆస్పటల్ లో ఉంది. పాప పరిస్థితి సీరియస్ అయ్యి ఐసీయూ లో ఉన్నప్పుడు ఈ విషయం శృతిహాసన్ కంటపడింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ICU లో ఉన్న ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేలా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించారు. పాప బ్రతకడానికి శృతిహాసన్ అందించిన పెద్ద మొత్తంలో డబ్బే కారణమని డాక్టర్లు సైతం తెలిపారు. ఇక పాప పూర్తిగా కోల్కున్న తర్వాత శృతిహాసన్ ను కలిసి ముచ్చటించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పసిపాప ప్రాణాలను కాపాడిన శృతిహాసన్ కు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలానే ప్రతి ఒక్క హీరో హీరోయిన్ అలాగే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కొన్ని సమయాల్లో ఇలాంటి వ్యాధులతో పోరాడుతున్నటువంటి పసిపాపలకు సహాయం అందించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న మొన్నటివరకు సోనూసూద్, చిరంజీవి ఇలా ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తులకు ఆర్థికంగా సహాయం అందించారు.

Read also : నిరుద్యోగుల ఉసురు ప్రభుత్వానికి తగలడం ఖాయం : కేటీఆర్

Read also : ప్ర‌మాద‌వశాత్తు కెనాల్‌లో ప‌డి బాలుడి మృతి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments