Thursday, February 19, 2026
HomeUncategorizedనెక్ట్స్ జ‌న‌రేష‌న్ లీడ‌ర్‌గా రేవంత్‌పై అధిష్టానం చూపు

నెక్ట్స్ జ‌న‌రేష‌న్ లీడ‌ర్‌గా రేవంత్‌పై అధిష్టానం చూపు

  • రేవంత్ వన్ మ్యాన్ షో
  • 80శాతానికి పైగా మెజార్టీ

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయ‌న సామార్థ్యానికి ఒక క‌ఠిన‌మైన ప‌రీక్ష‌గా నిలిచాయి. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహ చతురతకు నిదర్శనంగా మారింది.

ముఖ్యంగా పట్టణ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, గతంలో కేవలం గ్రామీణ పార్టీగా ఉన్న ముద్రను రేవంత్ చెరిపివేయగలిగారు. ఈ విజయంతో ఆయన హైకమాండ్ వద్ద తన పరపతిని అమాంతం పెంచుకున్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు, మున్సిపల్ పరిపాలన శాఖను కూడా తానే పర్యవేక్షిస్తున్నందున, ఈఎన్నికల గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత వహిస్తాననే ఉద్దేశంతో ఆ మాట అన్నట్లు వివరించారు. ఒక సేవకుడిగానే తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెబుతూనే, బాధ్యతను భుజానికెత్తుకునే విషయంలో తనకున్న తెగింపును చాటారు.

కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే గ్రూపు రాజకీయాలు రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. పార్టీలో ఆలస్యంగా చేరినప్పటికీ,సీనియర్లను సమన్వయం చేసుకుంటూనే, తన నిర్ణయాలే ఫైనల్ అనే స్థాయికి ఆయన ఎదిగారు.

గతంలో బహిరంగంగా విమర్శలు చేసిన నాయకులు కూడా ఇప్పుడు మౌనం వహించడం. రేవంత్ నాయకత్వాన్నిసమర్థించడం ఆయన సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం.

హైక‌మాండ్ పూర్తి మ‌ద్ద‌తు…
హైకమాండ్ పూర్తి మద్దతు ఉండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ ఇప్పుడు ఒక్కడే మొనగాడు గా కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక కామెంట్లు చేస్తున్నా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా గుర్తింపు పొందుతున్నారు.

హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నమ్మకాన్ని చూరగొనడంలో ఆయన సఫలీకృతులయ్యారు.వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎదురులేకుండా పోయింది.

అటు విపక్ష బీఆర్ఎస్ బలహీనపడటం, ఇటు బీజేపీ పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం రేవంత్‌కు కలిసొచ్చింది. తన సంక్షేమ పథకాలు, దూకుడుగా ఉండే రాజకీయ శైలితో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ యవనికపై ఒక బలమైన ముద్ర వేశారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments