
క్రైమ్ మిర్రర్, అరుంధతి :- అరుంధతి సినిమా ద్వారా ఫేమస్ అయిన నవాబు బంగ్లా నే నేటి ఈ అరుంధతి కోట. అరుంధతి అనే సినిమా ద్వారా ఈ కోటా చాలా ఫేమస్ అయింది. అరుంధతి సినిమా అంటే ప్రతి ఒక్కరికి కూడా మొదటిగా గుర్తుకు వచ్చేది ఈ కోట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, బనగానపల్లి మండలంలోని పాతపాడు గ్రామం శివారులో ఉంటుంది. ఇక అరుంధతి సినిమా ద్వారా ఈ కోట హైలెట్ అవడంతో… అప్పటినుంచి ఈ కోటని అరుంధతి బంగ్లా గా ప్రతి ఒక్కరూ పిలవడం ప్రారంభించారు. నిజం చెప్పాలంటే.. ఈ కట్టడాన్ని బనగానపల్లి చివరి నవాబు అలీఖాన్ 120 సంవత్సరాల క్రితం నిర్మించారని ఆధారాలున్నాయి. ఇలా చారిత్రకంగా మరోవైపు పర్యాటకంగానూ ఈ బంగ్లా అనేది చాలా ప్రాముఖ్యత దక్కించుకుంది.
Read also : BCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే సహించం : సీఎం రేవంత్
ఇలా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఈ బంగ్లా నేడు శిథిలావస్థకు చేరుకుంది. నవాబు వారసులమని చెప్పుకుంటూ అక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కూడా ఈ కోట సంరక్షణకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులు కోరుతున్నారు. ఈ అరుంధతి బంగ్లా లోపల బాగా మొత్తం కూడా పెచ్చులూడిపోయి… పైకప్పు పూర్తిగా ధ్వంసం అయిందని పర్యాటకులు చెప్తున్నారు. దీంతో అరుంధతి కోటకు చేయాల్సినటువంటి మరమ్మత్తులు వెంటనే ప్రారంభించాలని పర్యాటకులు కోరుతున్నారు. మరమ్మత్తులు చేయకుండా అలానే ఉంచితే… త్వరలోనే పూర్తిగా ధ్వంసం అయ్యేటువంటి అవకాశం ఉందని సూచిస్తున్నారు. అరుంధతి సినిమా ద్వారా ఫేమస్ అయిన ఈ కోటను చూడడానికి ఇప్పటికీ కూడా చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.
Read also : BCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే సహించం : సీఎం రేవంత్