వైరల్సినిమా

ప్రభాస్ కు షాకుల మీద షాక్స్.. ఆన్లైన్ లో HD ప్రింట్?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి “రాజాసాబ్” సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఒకవైపు పాజిటివ్ టాక్ మరోవైపు నెగటివ్ టాక్ రెండు వస్తున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏకంగా ప్రభాస్ ను ఒకలా ఊహించుకుంటే డైరెక్టర్ మారుతి మరోలా చూపించారు అని మారుతి పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కొంతమంది కేటుగాళ్లు కావాలనే ఈ చిత్రాన్ని పైరసి చేసి ఆన్లైన్ వెబ్ సైట్లలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి చాలా మంది ప్రభాస్ అభిమానులు ఎక్స్ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. విడుదలైన మొదటి రోజే ఇలా పైరసీ కావడం పట్ల ప్రభాస్ అభిమానులు అలాగే చిత్ర బృందం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు టికెట్ హైక్స్ విషయంలో ప్రభుత్వ మెమోను కొట్టివేసింది. మళ్లీ ఇప్పుడు సినిమా బాగాలేదు అంటూ కొంతమంది… ఈ సినిమా హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షమవడం పట్ల మరి కొంతమంది ఇలా చూసుకుంటూ పోతే ప్రభాస్కు అలాగే తన సినిమా రాజాసాబ్ కు భారీగానే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

Read also : అర్థరాత్రి ఎలుకల మందు ఆర్డర్ చేసిన మహిళ.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

Read also : Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి ₹1.02 కోట్ల రూపాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button