ఏపీ ఇంటర్ బోర్డు రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. అయితే ఆ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నారు.
తెరుచుకున్న వైకుంఠ ఉత్తర ద్వారం!… జనసంద్రం లో తిరుపతి?
తాజాగా ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. పబ్లిక్ పరీక్షలకు బదులుగా అంతర్గత పరీక్షల విధానం వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అమల్లోకి వస్తుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. అయితే ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, విద్యార్ధులందరూ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించింది.
తప్పు జరిగింది.. క్షమించండి!తిరుమలలో పవన్ కల్యాణ్ కన్నీళ్లు
ఇద్దరు సస్పెండ్.. నలుగురు బదిలీ.. సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్