Wednesday, February 18, 2026
Homeక్రైమ్పోస్టు మార్టంలో సంచ‌ల‌న నిజాలు

పోస్టు మార్టంలో సంచ‌ల‌న నిజాలు

  • ర‌చ‌యిత బొగ్గుల శ్రీ‌నివాస్ కేసులో పురోగ‌తి
  • ఒంటిపై గాయాలు
  • పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌ఠావో పాలిటిక్స్ బ‌చావో పుస్త‌క ర‌చ‌యిత బొగ్గుల శ్రీ‌నివాస్ ఈ నెల 14న ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండ‌లం పాలేరు రిజ‌ర్వాయ‌ర్‌లో కారు మునిగిన ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. కాగా శ్రీ‌నివాస్ స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, ఒంటిపై గాయాలు ఉన్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తూ కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా పోస్టు మార్టం నివేదిక‌లో సైతం ఒంటి పై గాయాలు ఉర్తించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగ ఇదిలా ఉండగా నీటిలో కారు మునిగిన అనంత‌రం డ్రైవ‌ర్ పారిపోయాడని స్థానికులు తెలుప‌డంతో కూసుమంచి పోలీసులు ఆ దిశ‌గా ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా దర్యాప్తు ప్రారంభించారు.

డ్రైవ‌ర్ హైద‌రాబాద్‌లో లొంగి పోయే ప్ర‌మాదం ఉంద‌ని అతడు దొరికితే పూర్తి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తుంది. అదే విధంగా కారు య‌జ‌మానికి సైతం విచారించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఏదేమైన రెండు మూడు రోజుల్లో శ్రీ‌నివాస్ మృతి మిస్ట‌రీ కొలిక్కి రానున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments